YS Jagan: తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన జగన్ వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని టీటీడీ అధికారులు, పోలీసులు, ఎవరూ సమర్ధవంతంగా భద్రత ఏర్పాట్లు చేయలేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకచోట మాత్రమే తొక్కిసలాట జరిగినట్లు చూపించి చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారంటూ వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు.
వైఎస్ జగన్ తెలిపిన వివరాల.. ప్రకారం బైరాగిపట్టెడలో ఐదుగురు, విష్ణు నివాసంలో ఒకరు చనిపోయారని ఎఫ్ఐఆర్ ఆధారంగా వెల్లడించారు. మొత్తంగా 6గురు మరణించగా 50 నుంచి 60 మంది గాయపడ్డారు. ప్రస్తుతం స్విమ్స్ లో 35 మంది చికిత్స పొందుతున్నారు. తిరుపతిలో జరిగిన ఈ ఘోరం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడనంత దారుణమైందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా భద్రత ఏర్పాట్లు చేయలేదు. టిటిడి అధికారులు, కలెక్టర్, ఎస్పీ వంటి పెద్దలు అందరూ బాధ్యత తీసుకోవాలి అన్నారు వైఎస్ జగన్. ఘటన వెనుక పలు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని త్వరలో వెలుగులోకి వస్తాయి అన్నారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ ప్రక్రియలో ఏర్పడిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇతర మంత్రులు స్పందించారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారని సమాచారం. ఇంత దారుణంగా వ్యవస్థ నడపడం చాలా దురదృష్టకరం ప్రభుత్వం బాధ్యత వహించి ఉంటే జరిగేది కాదు అని జగన్ అన్నారు. తిరుపతి ఘటనపై వైయస్ జగన్ చేసిన విమర్శలు ప్రభుత్వంపై ఆగ్రహం ఇప్పుడు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. భద్రతా లోపాలు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి.