AP High Court: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారనే ఆరోపణలతో ఆయనపై ఫోక్సో కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తిరుపతి జిల్లాలోని యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాల్లో ఈ వీడియో పోస్టు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఈ ప్రచారం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరగలేదని పోలీసులు ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.