PM MODI: తిరుమల ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. నేడు తిరుపతికి చంద్రబాబు

Update: 2025-01-09 00:42 GMT

Tirumala Stampade PM MODI: : తిరుమలలో తీవ్ర విషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉచిత టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. రుయా ఆసుపత్రికి తరలివచ్చిన రోగుల బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రి వాతావరణం విషాదంగా మారింది. భక్తులు ఒకటి కోరుకుంటే..దేవుడు మరొకటి తలచినట్లు అయ్యింది. తిరుమల చరిత్రలోనే ఇది దారుణ విషాదంగా నిలుస్తోంది.

మరణించిన వారి వివరాలు :

రజిని వైజాగ్ (47)

రాజేశ్వరి

మల్లిక - సేలం ( 49)

నాయుడు బాబు (51) నర్సీపట్నం

శాంతి వైజాగ్ ( 40)

గుర్తు తెలియని వ్యక్తి

ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలోని విశాఖకు మోదీ వచ్చిన రోజే ఈ ఘటన జరిగింది. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు మరణించడం చాలా దురద్రుష్టకరం అని ప్రధాని మోదీ అన్నారు. వారి మరణానికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఘ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు.

డిప్యూటీ సీఎం పవన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం:

తొక్కిసలాట ఘటనలో మరణించిన భక్తుల కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

నేడు తిరుపతికి చంద్రబాబు:

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారు. నేడు తిరుమలకు వెళ్తున్నారు. ఇందుకోసం ఆయన టూర్ కూడా ఖరారు అయ్యింది.

ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఆయన ఇంటి నుంచిహెలికాప్టర్ లో బయలు దేరి విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతికి చేరుకుంటారు. మధ్యాహ్నం తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 

Tags:    

Similar News