PM Modi Roadshow: విశాఖకు చేరుకున్న మోదీ.. బాబు, పవన్ తో రోడ్ షో..
PM Modi Roadshow: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం విశాఖపట్టణం చేరుకున్నారు.
PM Modi Roadshow: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం విశాఖపట్టణం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, అధికారులు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం వరకు మోదీ, బాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఏయూ గ్రౌండ్స్ కు చేరుకున్నారు.
విశాఖలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.విశాఖ రైల్వే జోన్ కు శ్రీకారం చుడతారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేపడుతారు. రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను జాతికి అంకితం ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో ప్రకారం విశాఖను రైల్వే జోన్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కేంద్రం. ఇందులో భాగంగానే రైల్వే జోన్ కు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. విశాఖ రైల్వే కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. తిరుపతి జిల్లాలోని కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ నగరానికి శంకుస్థాపన చేస్తారు. 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలనేది ప్లాన్.