Ambati Rambabu: పుష్ప కేమో నీతులు.. గేమ్ ఛేంజర్‌కు పాటించరా..!

Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.

Update: 2025-01-06 12:52 GMT

Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. పుష్ఫకేమో నీతులు చెప్తారా.. గేమ్ ఛేంజర్‌కు పాటించరా..! అని పవన్‌‌ను ట్యాగ్ చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

గేమ్ ఛేంజర్ ఈవెంట్ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు విమర్శలు చేశారు. హీరోలు వచ్చి తమకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం తమది కాదంటూ గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు హీరోలతో పనేంటి..? హీరోలు ఎందుకు రావాలి..? అలా హీరోలను రప్పించుకోవడం తమకు ఇష్టంలేదు. నిర్మాతలు ట్రేడ్ బాడీ యూనియన్ వచ్చినా టిక్కెట్ల ధరలు పెంపు ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలని ఆలోచించే లో లెవల్ వ్యక్తులం కాదన్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఆయన్ను ఎంతమంది విమర్శించినా కలిసి నటించేటప్పుడు బాగున్నారా అని గుండె నిండుగా పలకరించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కృష్ణ లాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఇతర హీరోల మీద వివక్ష చూపకపోవడం చిత్ర పరిశ్రమ తాలూక ఔన్నత్వం అదేనని ఆయన అన్నారు.అదే పద్దతిని తాము కొనసాగిస్తామన్నారు. చంద్రబాబు చిత్ర పరిశ్రమను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. తమకు చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఎక్స్ లో సెటైర్లు వేశారు. తోటి హీరోను అన్యాయంగా అరెస్ట్ చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం అంటూ మండిపడ్డారు.

ఇటీవల పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటన ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు హీరో అర్జున్‌‌ను తప్పుపడితే మరికొందరు ప్రభుత్వం, అధికారుల తీరును తప్పుబట్టారు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ ఈవెంట్ ను ఉద్దేశించి అంబటి రాంబాబు విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. శనివారం రోజు రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ(23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున చెరో రూ.5 లక్షలు ప్రకటించగా.. రాంచరణ్ ఇరువురు కుటుంబాలకు చెరో రూ.5 లక్షలు ప్రకటించారు.


Tags:    

Similar News