Tirumala: విషాదం..తిరుమల శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం..ఇద్దరు దుర్మరణం
Tirumala: తిరుమల జిల్లాలో విషాదం నెలకొంది. చంద్రగిరి మండలం నరసింగాపురం దగ్గర తిరుమల శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మరణించినవారిని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ, లక్ష్మమ్మగా గుర్తించారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. 108 వాహనం మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.