AP govt about HMPV Cases: హెచ్ఎంపీవీ కేసులపై స్పందించిన ఏపీ సర్కార్... వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే...

AP govt about HMPV Cases: హెచ్ఎంపీవీ కేసులపై స్పందించిన ఏపీ సర్కార్... వైరస్ ఎలా వ్యాపిస్తుంది, వైరస్ లక్షణాలు ఏంటి

Update: 2025-01-05 16:15 GMT

AP govt about HMPV Cases: చైనాలో హెచ్ఎంపీవీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో ఆస్పత్రులన్నీ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ రోగులతో నిండిపోయాయి. దీంతో ప్రస్తుతం చైనా పరిస్థితి చూసి ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అవుతున్నాయి. ఆ జాబితాలో భారత్ కూడా ఉంది.

భారత్ లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని చెక్ చేసుకుంటున్నాయి. ఇదే విషయమై నిన్న శనివారం తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయగా తాజాగా ఏపీ సర్కారు కూడా హెల్త్ అడ్వైజరీ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఎంపీవీ కేసులు లేవని ఏపీ పబ్లిక్ హెల్త్ , ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు.

ఏపీలోనే కాదు ... మొత్తం ఇండియాలోనే ఎక్కడ కూడా హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని అన్నారు. చైనాలో వ్యాపిస్తున్న ఆ వైరస్ గురించి ఏపీ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

న్యూమో విరిలే రకానికి చెందిన ఈ హ్యూమన్ మెటన్యూమో వైరస్ కూడా కరోనావైరస్ తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వైరస్ వేగంగా సంక్రమిస్తుందని వివరించారు.

HMPV Virus ఎలా వ్యాపిస్తుందంటే...

వైరస్ బారిన పడిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా, వారికి షేక్ హాండ్ ఇవ్వడం వల్ల, వారిని తాకడం వల్ల ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. వైరస్ ను తాకిన చేతితో నోరు, ముక్కు, కళ్లను తాకిన సందర్భాల్లో ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు.హెచ్ఎంపీవీ లక్షణాలు ఎప్పుడు తెలుస్తాయి?

హెచ్ఎంపీవీ వైరస్ ఒకరి ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత 3 నుంచి 10 రోజుల్లోగా వ్యాధి లక్షణాలు బయటపడతాయి. శీతా కాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయన్నారు.

హెచ్ఎంపీవీ వైరస్ సోకకుండా ఏం చేయాలంటే...

సబ్బుతో, సానిటైసర్స్ తో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.

దగ్గినపుడు, తుమ్మినపుడు, నోటిని, ముక్కును హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవాలి.

జనంతో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళరాదు.

మంచి పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవాలి.

తగినంత నిద్ర పోవాలి.

వైరస్ లక్షణాలు ఉన్న వారు క్వారంటైన్‌లో ఉండటం మంచిదని సూచించారు. సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్స్ సలహా ప్రకారమే మందులు వాడాలని సూచించారు.

Tags:    

Similar News