Andhra Pradesh Volunteers: ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై లోకేష్ క్లారిటీ..కానీ అదొక్కటే సమస్య
Nara Lokesh On Andhra Pradesh Volunteers: ఏపీలో గ్రామ,వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి నారాలోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ల అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా..ఈ సందర్బంగా లోకేశ్ వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనేది క్లారిటీ ఇచ్చారు. పుట్టని పిల్లలకు పెరెలా పెడతామని గ్రామ, వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో వాలంటీర్ల జీవోను అప్పటి సీఎం జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్ల ఉద్యోగాల్లోనే లేరని..ఎన్నికలప్పుడు 80శాతం మందితో జగన్ రాజీనామా చేయించారని తెలిపారు.
వాలంటీర్లు ఇప్పుడు లేరని..గత ప్రభుత్వ హయాంలో అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చారన్నారు. అది చట్టానికి విరుద్దమన్నారు. అది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని లోకేశ్ తెలిపారు. లీగల్ గా కూడా ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఈ విషయాన్ని గతంలోనే సంబంధిత శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతినెలా రూ.4వేలకోట్ల ఆర్థిక లోటుతో నడుస్తుందని తెలిపారు. ప్రతినెలా జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలిపారు. కేంద్రం సహకారంతోనే మెల్లగా పరిస్థితులను చక్కబెడుతున్నామని మంత్రి తెలిపారు.
కాగా గ్రామ, వార్డు వాలంటీర్లు కొద్దిరోజులుగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీ మేరకు తమను వాలంటీర్ ఉద్యోగాల్లో తీసుకోవాలని కోరుతున్నారు. రూ. 10వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కూటమి సర్కార్ వాదన మాత్రం మరోలా ఉంది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను ఉద్యోగాల్లో కొనసాగింపు పై ఎలాంటి జీవో ఇవ్వలేదని తెలిపింది. గతేడాది ఆగస్టు నుంచి వాలంటీర్ల కొనసాగింపునకు సంబంధించి క్లారిటీ లేకుండా పోయిందన్నారు. అందుకే తాము వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోలేకపోతున్నామని..వారి చదువుకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించడంతోపాటు వారికి ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వారికి స్థానికంగానే ఉద్యోగం, ఉపాధి దక్కే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని వాలంటీర్లు కూడా అర్థం చేసుకోవాలని కోరుతోంది ప్రభుత్వం.
అయితే వాలంటీర్లు మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. తమకు రూ. 10వేలు జీతంతో పాటు ఉద్యోగాల్లోకీ తీసుకుంటామని చెప్పారని..ఆ హామీని నిలబెట్టుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు.