Tirupati Stampede: తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేక దర్శనం

Vaikunta Ekadashi: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ యంత్రాంగం.

Update: 2025-01-10 07:29 GMT

Tirupati Stampede: తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేక దర్శనం

Vaikunta Ekadashi: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ యంత్రాంగం. సీఎం చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు అదేశాల జారీ చేశారు. ప్రోటోకాల్ దర్శనం ముగిసిన వెంటనే 52 మందికి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అధికారులు. మంచి వైద్యం అందించి, వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు బాధిత భక్తులు.

తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఇందులో చర్చించనున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. 

Tags:    

Similar News