Pawan Kalyan: మీరు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే.. తిరుపతి ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: తిరుపతి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Pawan Kalyan: తిరుపతి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణ చెప్పానని.. టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్యచౌదరి కూడా క్షమాపణ చెప్పాలన్నారు. అధికారులంతా బాధ్యతగా పని చేయాలన్నారు పవన్ హెచ్చరించారు. అధికారులు చేసిన తప్పుకు ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సనాతన ధర్మం పాటించే హిందువులును క్షమాపణ అడిగాను.. ఎవరి భాద్యత వాళ్ళు నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. ఎక్కడ ఎలా స్పందించాలో యువత కూడా ఆలోచించాలి. చావులు దగ్గర కేరింతలు, అరుపులు భావ్యం కాదని పవన్ హితబోధ చేశారు. ప్రజలిచ్చిన గెలుపుతోనే టీటీడీ చైర్మన్ అయినా.. ఈవో అయినా.. సీఎం చంద్రబాబు, తానైనా.. అందుకే టీటీడీ అధికారులు కూడా కచ్చితంగా ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.