Vaikanta Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన ముక్కోటి ఏకాదశి వేడుకలు
Vaikanta Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. గురువారం రాత్రం నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులకు భారీగా తరలివెళ్లారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తుంటారు. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన తర్వాత 4.30గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు.
భద్రాచలంలో ఉదయం 5గంటల భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్లో ఉదయం 5.15 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తరద్వార దర్శనం ఇస్తున్నారు. నేడు స్వామివారికి గరుడ సేవత్సవం, తిరువీధిసేవ నిర్వహించారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు.