కోళ్లకు అందాల పోటీలు.. వీటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Cocks Beauty Pageants: కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. నిజమే మీరు విన్నది అక్షరాల వందకు వంద శాతం నిజం.
Cocks Beauty Pageants: కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. నిజమే మీరు విన్నది అక్షరాల వందకు వంద శాతం నిజం. ఇక్కడ ప్రత్యేకంగా పెంచిన కోళ్లకు ఆందాల పోటీలు నిర్వహిస్తున్నారు. మన చుట్టుక్కల రాష్ట్రాల నుంచే కాకుండా అరబ్ దేశాల నుంచి కూడా కోళ్ల అందాల పోటీల్లో పాల్గొంటారు.
ప్రకాశం జిల్లా రాజపాలెంలో కోళ్లను అందాల పోటీల కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ కోళ్లను పర్ల కోళ్ళు, చిలకముక్కు కోళ్ళు, ప్యారెట్ బిగ్ అని పిలుస్తుంటారు. ఈ కోళ్లముక్కులు అచ్చం చిలకను గుర్తుకొచ్చేలా ఉంటే ఇక వీటి తోకలు నెమలిని పోలి ఉండడం మరో విశేషం...చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కోళ్లపై మక్కువతో తాను ఈ చిలకముక్కు కోళ్ళు పెంచుతున్నానని సంరక్షకుడు సయ్యద్ భాషా చెబుతున్నారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ కోళ్ల అందాల పోటీలు అత్యధికంగా జరుగుతాయంటున్నారు. గతంలో జరిగిన కోళ్ల అందాల పోటీలకు తన కోళ్లను తీసుకువెళ్లిబంగారు, వెండి పధకాలు బహుమతులుగా గెలుచుకున్నట్టు చెబుతున్నారు.
కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన అనంతపూర్ జిల్లాలలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు కోళ్ల అందాల పోటీలు జరుగుతాయని చెబుతున్నారు. .. ఈ కోళ్ల అందాల పోటీలలో మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అరబ్ దేశాల నుంచి ప్రత్యేకంగా వచ్చి పాల్గొంటారు. అక్టోబర్, నవంబర్ నుంచి కోళ్ల యజమానులు తమ కోళ్లను అందాల పోటీలకు సిద్ధం చేస్తారు. ఇక ఈ కోళ్ల ధరలు లక్షల్లో ఉంటాయి. అంతే కాకుండా వీటి సంరక్షణ కొసం చాలా ప్రత్యేకంగా కూడా తీసుకోవాలని చెబుతున్నాడు. ఆహారం నుంచి వాతవరణంలో మార్పుల సమయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఈ కొళ్ల సంరక్షకులు చెబుతున్నారు.
ఈ చిలకముక్కు కోళ్లకు చెందిన గుడ్డు విలువే వేయి రూపాయల వరకూ ఉంటుంది. ఇక నెల కోడి పిల్ల విలువ మూడు వేల నుంచి అయిదు వేల రూపాయలు ఉంటుంది. ఇక అందాల పోటీలకు వచ్చే ఒక్క కోడి పుంజు కనీసం 30 లక్షలకు పైగా ధర పలుకుతుంది. అచ్చం బాడీ బిల్డర్ ని తలపించే షేపుతోపాటు దీని నడక కూడా వయ్యారంగా ఉంటుంది. అందుకే ఈ కోళ్లకు అంత డిమాండ్ అని కోళ్ల ప్రేమికులు అంటున్నారు.