Rain Alert: తీరాన్ని తాకిన అల్పపీడన..ఏపీలో మోస్తరు వర్షాలు..తెలంగాణలో పెరగనున్న చలి

Update: 2024-12-12 01:20 GMT

Rain Alert: డిసెంబర్ లో వర్షాలు కురుస్తుండటం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వర్షాలు పడటంతో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. వరి ధాన్యం తడిసి ముద్దవుతుంది. నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే నేడు రోజంతా బలంగానే ఉండే అవకాశలు కనిపిస్తున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు రాయలసీమలో తేలికపాి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఇక ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం తూర్పు రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఏపీలోని మిగతా ప్రాంతాల్లో పూర్తిగా మేఘాలు కమ్ముకుని ఉంటాయి. తెలంగాణలో మాత్రం మేఘాలు వస్తూ పోతుంటాయి. చలి తీవ్రత భారీగా పెరిగే సంకేతాలు ఉన్నట్లు తెలిపింది.

బంగాళాఖాతంలో గాలివేగం పెరిగిందని..గంటకు 35కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలో గంటకు 10 కిలోమీటర్లు, తెలంగాణలో 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. తెలంగాణలో తేమ శాఖం 40 కంటే తక్కువగా ఉంటుంది. దీంతో తెలంగాణలో నేడు జల్లులు పడే అవకాశం లేదు. ఏపీలో కోస్తా, ఉత్తరాంధ్రలో తేమ 60శాతం ఉంటుంది. రాయలసీమలో మాత్రం 70 నుంచి 90శాతం వరకు ఉంటుంది. నేడు రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Tags:    

Similar News