Avanthi Srinivas: వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్
వైఎస్ఆర్ సీపీకి (YSRC) మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్( Avanthi Srinivas) గురువారం రాజీనామా చేశారు.
వైఎస్ఆర్ సీపీకి (ysrcp) మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ వైఎస్ జగన్ (ys jagan) పంపారు. ఇవాళ విశాఖపట్టణంలో ఆయన మీడియా సమావేశంలో తన రాజీనామా లేఖను విడుదల చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వైఎస్ జగన్ గుర్తించాలని ఆయన సూచించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన అన్నారు. ఐదేళ్లు పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని ఆయన ఆవేదన చెందారు. కొత్త ప్రభుత్వంపై అప్పుడే ఆందోళనలు చేయడాన్ని ఆయన తప్పు బట్టారు.
2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావుతో కలిసి అవంతి శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరారు. భీమిలి నుంచి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. 2024 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.