YS Jagan: మాజీ సీఎం జగన్ కు షాక్.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ, ఈడీ

YS Jagan: జగన్ ఆస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు(Supreme Court).

Update: 2024-12-13 07:43 GMT

YS Jagan: మాజీ సీఎం జగన్ కు షాక్.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ, ఈడీ

YS Jagan: జగన్ ఆస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు(Supreme Court). సీబీఐ, ఈడీ కేసుల వివరాలను డిసెంబర్ 12న ఫైల్ చేశామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జగన్ కేసుల విచారణలో జాప్యంపై అఫిడవిట్ రూపంలో నివేదిక అందించారు.

విచారణ ఎందుకు జాప్యం జరుగుతోంది అఫిడవిట్ లో వివరించిన దర్యాప్తు సంస్థలు. రిపోర్ట్ కాపీ పరిశీలిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం తెలిపింది. అయితే స్టేటస్ రిపోర్ట్ పరిశీలనకు జగన్ తరపు న్యాయవాదులు సమయం కోరారు.

జగన్(Jagan) కేసుల విచారణ ఆలస్యమౌతోందని,ఈ కేసుల విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని మరో పిటిషన్ ను రఘురామకృష్ణరాజు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లతో పాటు జగన్ బెయిల్ రద్దు చేయకపోతే విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని మరో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలు పరిశీలించాక తీర్పు ఇస్తామని ధర్మాసనం ప్రకటించింది. దీంతో ఈ పిటిషన్లపై విచారణను 2025 జనవరి 10కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

దర్యాప్తు సంస్థలు ఏం చెప్పాయంటే?

జగన్ కు సంబంధించిన కేసుల్లో 120 మంది నిందితులపై చార్జీషీట్లు దాఖలు చేసినట్టు సీబీఐ, ఈడీ తెలిపింది.ఇప్పటివరకు 860 మంది సాక్షులను కోర్టులు విచారించాయి.ట్రయల్ కోర్టుల్లో 11 కేసుల్లో దాఖలైన 86 డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఏ ఒక్క డిశ్చార్జి పిటిషన్ లోనూ తుది తీర్పు రాలేదని వివరించింది.తెలంగాణ హైకోర్టులో నిందితులు 40 పిటిషన్లు దాఖలు చేస్తే అందులో 27 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.సుప్రీంకోర్టులో దాఖలైన 15 పిటిషన్లలో 12 పెండింగ్ లో ఉన్నాయని సీబీఐ, ఈడీ ప్రకటించాయి.

Tags:    

Similar News