Bhogi Wishes: రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్
Bhogi Wishes: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా భోగి శుభాకాంక్షలు తెలియజేశారు.
Bhogi Wishes: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని.. పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు చంద్రబాబు. భోగి మండలతో మీ సమస్యలన్నీ తీరిపోయి, భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మీ ఆశలు, ఆశయాలు తీర్చడానికి ప్రజా ప్రతినిధులుగా మీకు అన్ని వేళలా మేము తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు లోకేష్. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. భోగి మంటల్లో ఏ విధంగా పాతదనం కాలిపోయిందో.. మీ జీవితంలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభాలు జరగాలని.. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని కోటుకుంటున్నానంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ఇక సంక్రాంతి సంబరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెకు వెళ్లారు. 14వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. చంద్రబాబు దంపతులతో పాటు లోకేష్ దంపతులు, నందమూరి బాలకృష్ణ దంపతులు కూడా నారావారిపల్లె వెళ్లారు.