Weather Report: దూసుకొస్తున్న అల్పపీడనం..ఏపీకి వర్ష సూచన

Update: 2025-01-10 23:54 GMT

Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఏపీవైపు దూసుకువస్తోంది. ఇది సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలను కలిగి ఉంది. దీంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో జనవరి 13వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని చెప్పింది. తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 12వ తేదీన అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంటే భోగి పండగ సమయంలో ఏపీకి వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు రోజంతా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూపోతుంటాయి. చలి కొంత మేర తగ్గుతుంది. కానీ గాలి వేగం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడా కూడా వర్షం పడే అవకాశం లేదు. సొంత ఊళ్లకు వెళ్లేవారికి నేడు వాతావారణం చాలా బాగుంటుంది. గాలివేగం బంగాళాఖాతంలో గంటకు 35కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 15కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 12కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. బలమైన గాలులు వీస్తున్నాయి. టూవీలర్లపై ప్రయాణం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇక పగటి సమయంలో తెలంగాణలో 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి సమయంలో తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది క్రమంగా చలి తగ్గుతూ, వేడి పెరిగే ఛాన్స్ ఉంటుంది.

ఇక తెలంగాణలో పగటివేళ 50శాతం తేమ ఉండగా...ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో 40శాతం తేమ ఉంటుంది. రాయలసీమలో మాత్రం 70శాతం వరకు ఉంటుంది. రాత్రివేళ రెండు రాష్ట్రాల్లో 90శాతం వరకు ఉంటుంది. రాత్రివేళ మంచు బాగా కురిసే అవకాశం ఉంది. మొత్తంగా నేడు సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారికి వాతావరణం మాత్రం బాగుంటుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News