Weather Report: కొనసాగుతున్న అల్పపీడనం.. రాయలసీమలో వర్షాలు.. మామిడితోటలకు తీవ్ర నష్టం
Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం యాక్టివ్ గానే కొనసాగుతోంది. దీని ప్రభావంతో నిన్న రాయలసీమలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మామిడిపూతకు తీవ్ర నష్టం కలిగించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాయణం మొదలైంది. రాత్రి సమయం తగ్గుతూ..పగలు సమయం పెరుగుతుంది. చలి మాత్రం మరికొంతకాలం ఉంటుందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి వెళ్లడంతో దాని ప్రభావంతో నేడు తమిళనాడు, పుదుచ్చేరిపై ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు, ఏపీ, తెలంగాణలో రోజంతా మేఘాలు వస్తూ పోతుంటాయి. బలమైన గాలులు వీస్తాయని ఎక్కడా కూడా వర్షం పడే ఛాన్స్ లేదని ఐఎండీ తెలిపింది. గాలివేగం బంగాళాఖాతంలో గంటకు 35కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 17 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 15కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ప్రయాణాలు చేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఉష్ణోగ్రత పగటివేళ తెలంగాణలో 27 డిగ్రీల సెల్సియస్ ఉంటే..ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. రాత్రివేళ తెలంగాణలో 18 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. తేమ తెలంగాణలో 50శాతం ఉంటే ఏపీలో 60 నుంచి 70శాతంగా ఉంటుంది. రాత్రివేళ తేమ రెండు రాష్ట్రాల్లో పెరుగుతుంది. 90శతం దాకా ఉండనుంది. మొత్తంగానేడు కనుమ పండగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం బాగుంటుందని ఐఎండీ తెలిపింది.