Nara Lokesh: సతీమణికి మంత్రి లోకేష్ స్పెషల్ గిఫ్ట్.. కృతజ్ఞతలు తెలిపిన బ్రహ్మణి
Nara Lokesh: నారా లోకేష్ తన భార్య బ్రహ్మణికి సంక్రాంతి కానుకగా మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు.
Nara Lokesh: నారా లోకేష్ తన భార్య బ్రహ్మణికి సంక్రాంతి కానుకగా మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఆమె ఈ చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మేరకు లోకేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైనదని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతిచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ పోస్టును నారా బ్రహ్మణి రీపోస్టు చేశారు. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉందని చెబుతూ లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.
సంక్రాంతి రోజు లోకేష్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి చేనేత దుస్తులు ధరించడం ద్వారా మంగళగిరి చేనేత చీరలను ధరించారు. తమపై లోకేష్, ఆయన కుటుంబం చూపుతున్న అభిమానానికి మంగళగిరి చేనేత కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.మంత్రి లోకేష్ సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో ఘనంగా జరుపుకున్నారు.