Liquor Prices: సంక్రాంతి వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన ధరలు

Liquor Prices: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ మందుబాబులకు ప్రభుత్వం మంచి కిక్కిచే శుభవార్త చెప్పింది.

Update: 2025-01-14 07:33 GMT

Liquor Prices: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ మందుబాబులకు ప్రభుత్వం మంచి కిక్కిచే శుభవార్త చెప్పింది. మద్యం ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకువచ్చింది. అందులో భాగంగా రూ.99 కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 16 కంపెనీలతో మద్యం ధరల తగ్గింపుపైన ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇప్పటికే పది కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించగా.. తాజాగా మరో ఆరు కంపెనీలు ముందుకు రావడంతో వీటి ధరలు తగ్గాయి. కొన్ని ప్రముఖ బీర్ల ధరలు తగ్గించారు. దీంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రూ.99కే క్వార్టర్ మద్యంకు భారీ డిమాండ్ ఉండడంతో మరికొన్ని కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. తగ్గించిన ధరలతోనే మద్యం సరఫరా చేయడం ప్రారంభించాయి. అయితే మద్యం కంపెనీలు తమ అమ్మకాలు పెంచుకోవడానికే ఈ ధరల తగ్గింపు వ్యూహాలను అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించడంతో ఇతర కంపెనీల పైన ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ కంపెనీలు సైతం ఇప్పుడు ధరల తగ్గింపునకు ముందుకు వస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో అధిక ధరలకు విక్రయాలు జరిపినా, బెల్టు షాపులు నిర్వహించినా.. వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా మద్యం విక్రయాల పైన నిఘా పెరిగింది. దీంతో ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకునే విధంగా కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి.

ప్రస్తుతం క్వార్టర్ సీసాలపై రూ.20 నుంచి రూ.80 వరకు తగ్గింపును అమలు చేస్తున్నారు. మ్యాన్షన్ హౌస్ కంపెనీ క్వార్టర్ సీసాపై రూ.30 తగ్గించింది. అదే విధంగా అరిస్‌ర్టోకాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధర ఏకంగా రూ.50 తగ్గింది. కింగ్ ఫిషర్ బీరు రూ.10 తగ్గింది. బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒకేసారి రూ.80 తగ్గించేందుకు దరఖాస్తు చేసింది. కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయనే వాదన వినిపిస్తోంది. కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు. కానీ మందు బాబులు మాత్రం ధరల తగ్గింపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News