Nara Lokesh: నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం?

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది.

Update: 2025-01-15 05:08 GMT

Nara Lokesh: నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం?

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. రానున్న నాలుగున్నర ఏళ్లు లోకేష్ నాయకత్వాన్ని పటిష్ట పర్చటానికి కీలక సమయమని, ఆ దిశగా అడుగులు వేయాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, వీలైనంత తొందరగా లోకేశ్‌ను డిప్యూటీ సిఎం చేయాలని, ఆ తరువాత సీఎం సీటును అప్పగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ఇప్పటికే మంత్రాంగం మొదలయింది. అయితే, డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని షరతు విధించిన పవన్ కల్యాణ్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది. కూటమి ప్రభుత్వ తీరుతెన్నులను, టీడీపీ ప్రణాళికలను నిశితంగా గమనిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందికు సమ్మతించక పోవచ్చన్నది జనసేన వర్గాల్లో టాక్.

ఈ పరిస్థితుల్లో పవన్ అనే హర్డిల్ ను అధిగమించి లోకేష్ కు పట్టం కట్టేందుకు చంద్రబాబు ఇప్పటికే ఎత్తుగడలు వేయడం మొదలు పెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించినప్పుడు, ప్రధానితో పాటు వేదిక మీద లోకేశ్‌కు స్థానం కల్పించడం ఈ ఎత్తుగడల్లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అసర్టివ్‌గా ఉండడం, కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట వంటి ఘటనల్లో కఠినమైన వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు టీడీపీ శ్రేణులను ఆలోచనల్లో పడేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో పవన్ స్పెషల్ ఫోర్సుగా కనిపించడం టీడీపీని ఇరకాటంలో పడేస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా లోకేశ్‌ను ముందుకు తీసుకురావాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు.

ఈ అంతర్గత చర్చలకు అద్దం పడుతున్నట్లుగా ఇటీవల టీడీపీ అనుకూల మీడియా కూడా పవన్ వ్యతిరేక స్వరం ప్రారంభించింది. లోకేష్ కు డిప్యూటీ సిఎం ఇవ్వాలని చంద్రబాబు పై ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు రాస్తూ, ప్రసారం చేస్తూ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, చంద్రబాబు కనుక అలాంటి నిర్ణయమే తీసుకుంటే, తాము ఎలా రియాక్ట్ అవాలనే విషయమై కూడా జనసేనలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది.

Tags:    

Similar News