Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం కోసం పోలీసుల వేట
Perni Nani Family: పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో పౌరసరఫరాల శాఖకు చెందిన రేషన్ బియ్యం మాయమైన వ్యవహరం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Perni Nani Family: పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో పౌరసరఫరాల శాఖకు చెందిన రేషన్ బియ్యం మాయమైన వ్యవహరం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పేర్ని నాని(Perni Nani) కుటుంబం ఏడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. పేర్ని నాని కుటుంబం ఆచూకి కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇప్పటికే నాని అనుచరుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఏపీ హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మరో వైపు మచిలీపట్నం(Machilipatnam) జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనున్నది. జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాది పేర్ని నానికి సన్నిహితుడని ప్రభుత్వం గుర్తించింది. మరో పీపీని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోర్టు తీర్పును బట్టి పేర్ని నాని బయకు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఇవాళో, రేపో నాని కుటుంబ సభ్యులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.