Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు ఏపీ హైకోర్టులో పిటిషన్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు ఏపీ హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-12-17 09:05 GMT

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు ఏపీ హైకోర్టులో పిటిషన్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు ఏపీ హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్(Jada Sravan Kumar) పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పవన్ కళ్యాణ్ పై కేసును ఉపసంహరించుకున్నారు.

అసలు కేసు ఏంటి?

2023 జులై 9న ఏలూరులో వారాహి(Varahi) సభలో పవన్ కళ్యాణ్ కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వాలంటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ జులై 20న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపై పవన్ కళ్యాణ్ హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఈ లోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ కేసును ఉపసంహరించుకోవడంపై వాలంటీర్ల తరపున శ్రవణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News