Rains Update: బలపడుతున్న అల్పపీడనం..మూడు రోజులు పాటు అతి భారీ వర్షాలు..ఐఎండీ అలర్ట్

Update: 2024-12-18 00:18 GMT

Rains Update: తెలుగు రాష్ట్రాల్లో చలిపులి వణికిస్తోంది. అయితే తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది ఐఎండీ. నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోందని భారతవాతావరణ శాఖ తెలిపింది. ఇది 2 రోజుల్లో తమిళనాడు తీరంవైపు వెళ్తుందని తెలిపింది. దీంతో 18,19 తేదీల్లో తమిళనాడు, రాయలసీమలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని..నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక ఇవాళ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని 18,19,20 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోని 10 ప్రధాన జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 17 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కోస్తాంధ్రలో కొన్ని చోట్ల యానం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అటు ఏపీలోని కోస్తా జిల్లాలు..మరీ ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు.ఇక 18 వ తేదీన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి, రెండు చోట్ల బాపట్ల, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు.

19వ తేదీన అదే జిల్లాలో బాపట్ల క్రిష్ణ అలాగే రాయలసమీలోని కొన్నిచోట్ల 20వ తేదీన రాయలసీమ యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రజలను అలర్ట్ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉమ్మడి జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరంతోపాటు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ఉంటాయని తెలిపారు.  

Tags:    

Similar News