Paritala Ravi: పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్

Paritala Ravi Murder Case: 2005 జనవరి 24న అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలోనే ఆయన హత్యకు గురయ్యారు. ఈ కేసులో ముద్దాయి మొద్దు శ్రీనును అనంతపురం జైల్లో ఓం ప్రకాష్ అనే ఖైదీ హత్య చేశారు.

Update: 2024-12-18 14:22 GMT

Paritala Ravi: పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్

Paritala Ravi Murder Case: పరిటాల రవి (Paritala Ravi) హత్య కేసులో దోషులకు ఏపీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ3 పండుగ నారాయణ రెడ్డి, ఏ 4 రేఖమయ్య, ఏ5 భజన రంగనాయకులు, ఏ6 వడ్డే కొండ, ఏ8 ఓబిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 18 ఏళ్ల తర్వాత ముద్దాయిలకు బెయిల్ మంజూరైంది. 2005 జనవరి 24న అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలోనే ఆయన హత్యకు గురయ్యారు. ఈ కేసులో ముద్దాయి మొద్దు శ్రీనును అనంతపురం జైల్లో ఓం ప్రకాష్ అనే ఖైదీ హత్య చేశారు.

పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డిని హైదరాబాద్ బంజారాహిల్స్ నవోదయ కాలనీవద్ద కారులోనే అతని అనుచరుడు భాను కిరణ్ 2011 జనవరి 4న కాల్చిచంపారు. ఈ కేసులో అరెస్టైన భానుకిరణ్ ఈ ఏడాది నవంబర్ 5న బెయిల్ మంజూరు చేసింది కోర్టు.12 ఏళ్ల తర్వాత ఆయనకు బెయిల్ లభించింది.

1993 జూన్ 7న పరిటాల రవి తెలుగు దేశం పార్టీలో చేరారు. రాయలసీమలో టీడీపీని బలోపేతం చేయడంలో ఆయనది కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ కేబినెట్ లో పరిటాల రవి కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు.  ఎన్టీఆర్ మరణించిన తర్వాత కొంతకాలం ఎన్టీఆర్ వైపే ఉన్నారు.  అప్పట్లో మారిన రాజకీయ పరిస్థితుల్లో పరిటాల రవి చంద్రబాబు వైపు వచ్చారు.

Tags:    

Similar News