AP Liquor : మందుబాబులకు మత్తెక్కించే వార్త..ఏపీలో తగ్గిన మద్యం ధరలు..కొత్తరేట్లు చూస్తే కిక్కు మామూలుగా ఉండదు
AP Liquor Price Down: మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. వచ్చేది క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలు. ఈ సమయంలో ఏపీ సర్కార్ మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో 11 మద్యం తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వమే కారణం. ఎందుకంటే బ్రాండెండ్ మద్యం అని పేరు చెప్పి ఈ కంపెనీలు మద్యం ధరలు భారీగా పెంచాయి. దాంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ధరలు తగ్గించమని కంపెనీలకు చెప్పింది. దీంతో ఆయా కంపెనీలు ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఇక ఏపీలో ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ విధానం ఉంది. లిక్కర్ షాపుల నిర్వహణలో నేతలు పాలుపంచుకోవద్దని సీఎం చంద్రబాబు చెప్పారు. అయినా చాలా మంది భాగస్వాములుగా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిన రహస్యం. ఎన్నికల సమయంలో టీటీడీ అధినేత చంద్రబాబు క్వార్టర్ మద్యాన్ని రూ. 99కే అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారుంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు చేయడం కష్టంగా మారింది. దీంతో కంపెనీలు ధరలను పెంచేశాయి.
కొన్ని రోజులుగా ప్రభుత్వం మద్యం తయారీ కంపెనీలతో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలించాయి. మూడు కంపెనీలు, ముందుగా ధరలు తగ్గించేశాయి. దీంతో ఆ కంపెనీల మద్యానికి డిమాండ్ భారీగా పెరిగింది. తద్వారా ఆ కంపెనీలకు ఒక్కో బాటిల్ పై వచ్చే లాభం తగ్గినా..సేల్స్ పెరగడంతో భారీగా ఆదాయం రావడాన్ని మిగతా కంపెనీలు చూశాయి. తక్కువ లాభ ఎక్కువ సేల్స్ అనే ఆర్థిక సూత్రాన్ని ఆ కంపెనీలు కూడా పాటించాలని నిర్ణయించుకున్న తర్వాత ధరలును తగ్గించాయి. క్వార్టర్ బాటిల్ ధర రూ. 30 తగ్గుతుంది. ఫుల్ బాటిల్ రూ. 90 రూపాయల నుంచి 120 రూపాయల వరకు తగ్గుతుంది.