Earth quake in Prakasam District: ప్రకాశం జిల్లాలో మూడో రోజూ భూకంపం

ప్రకాశం జిల్లాలో(Prakasam District) సోమవారం భూమి కంపించింది. వరుసగా మూడు రోజులుగా భూప్రకంపలు (Earth Qauake) చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.

Update: 2024-12-23 06:56 GMT

Earth quake in Prakasam District: ప్రకాశం జిల్లాలో మూడో రోజూ భూకంపం

Earth quake:ప్రకాశం జిల్లాలో(Prakasam District) సోమవారం భూమి కంపించింది. వరుసగా మూడు రోజులుగా భూప్రకంపలు (Earth Qauake) చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. . జిల్లాలోని ముండ్లమూరు (Mundlamur)లో ఉదయం 10:35 గంటలకు భూమి కంపించింది. మూడు రోజులుగా ఇదే సమయానికి భూమి కంపించింది.

జిల్లాలోని దర్శి, సంతనూతలపాడు,అద్దంకి నియోజకవర్గాల్లో తరచుగా భూప్రకంపనలు వస్తుంటాయి. ఈ ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమ ఉంది. గ్రానైట్ వెలికితీత కోసం పెద్ద పెద్ద పేలుడు పదార్ధాలను ఉపయోగిస్తారు. దీంతో భూమిలో పొరల్లో సర్దుబాటు కారణంగా భూమి కంపించి ఉండవచ్చనే భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరుసగా మూడు రోజులుగా ఇదే ప్రాంతంలో ఎందుకు భూమి కంపించిందనే విషయాలపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే భూకంప తీవ్రతలు రెక్టర్ స్కేల్ పై 3.0 గా నమోదౌతున్నాయి. మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది.

డిసెంబర్ 4న మేడారం కేంద్రంగా భూకంపం వచ్చింది. గోదావరి పరివాహక ప్రాంతంలో దీని ప్రభావం కన్పించింది. రెక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రత నమోదైంది. మేడారం నుంచి ప్రకాశం జిల్లా వరకు భూమి కంపించింది. 17 రోజుల తర్వాత ప్రకాశం జిల్లాలో వరుసగా భూకంపం వచ్చింది. మూడు రోజులు ఒకే సమయానికి భూమిలో ప్రకంపనాలు వచ్చాయి.

భూ ప్రకంపనలపై ఆరా తీసిన మంత్రులు

జిల్లాలో భూమి ప్రకంపనాలపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. భూకంపం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు. తరచుగా భూమి ఎందుకు కంపిస్తుందో భూగర్భ శాస్త్రవేత్తలతో మాట్లాడి తెలుసుకోవాలని మంత్రులు కలెక్టర్ ను ఆదేశించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు కోరారు. మరో వైపు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు మంత్రులు ధైర్యం చెప్పారు.

Tags:    

Similar News