Nara Devansh: నారా దేవాన్ష్ వరల్డ్ రికార్డ్..కొడుకు విజ‌యం ప‌ట్ల‌ లోకేష్ ఆనందం

Update: 2024-12-23 03:26 GMT

Nara Devansh: ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. 175 పజిల్స్ లో ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా 9ఏళ్ల దేవాన్ష్ ఈ రికార్డ్ నెలకొల్పినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ ఈ విషయాన్ని తెలిపింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధ్రువీకరణను అందుకోవడం పట్ల నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకతంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించారని తెలిపారు. వ్యూహాత్మకమైన ఆటతీరు, అద్భుత ప్రదర్శనతో నారా దేవాన్ష్ చెక్ మేట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు వాటి కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు.

చెస్ లో నారా దేవాన్ష్ నెలకొల్పిన మూడో వరల్డ్ రికార్డు ఇది. దేవాన్ష్ ఓ రెండు రికార్డులను తన పేరుమీద లిఖించుకున్నాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచి ఈ రికార్డులను నెలకొల్పాడు దేవాన్ష్. ప్రపంచ రికార్డు పట్ల న్యాయ నిర్ణేతలు, లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. చిన్న వయస్సులో తనయుడు దేవాన్ష్ సాధించిన విజయాలపై తండ్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News