Jagtial: భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ టవర్ ఎక్కిన భర్త
Jagtial: భార్య కాపురానికి రావడం లేదని, న్యాయం చేయాలని భర్త నిరసన
Jagtial: భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు ఓ భర్త. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో లావణ్య, ప్రభాకర్ దంపతుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చినా వివాదం సద్దుమనగలేదు. చివరికి లావణ్య మూడురోజుల క్రితం తన పుట్టింటికి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. తన భార్య కాపురానికి రావడం లేదని, న్యాయం చేయాలని భర్త ప్రభాకర్ కరెంట్ హెవీ లైన్ పోల్ టవర్ ఎక్కాడు. పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో కిందకు దిగాడు ప్రభాకర్.