BJP protests: గాంధీ భవన్ ఎదుట ఉద్రిక్తత... బీజేపి శ్రేణుల అరెస్ట్

BJP MP Ramesh Bidhuri issue: ప్రియాంక గాంధీపై బీజేపి ఎంపీ రమేశ్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించింది.

Update: 2025-01-07 10:30 GMT

గాంధీ భవన్ ముట్టడించేందుకు యత్నిస్తోన్న బీజేపి శ్రేణులు

BJP protests against Congress: తమ పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి మంగళవారం బీజేపీ ప్రయత్నించింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ ముందు బైఠాయించాయి. గాందీ భవన్ వద్ద ఉన్న ప్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చించివేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. నిరసనకు దిగిన బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రియాంక గాంధీపై బీజేపి ఎంపీ రమేశ్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం బీజేపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags:    

Similar News