Formula E Car Race Case: సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
ఫార్మూలా ఈ కారు రేసు (Formula E Car Case) కేసులో బీఆర్ఎస్ (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)మంగళవారం సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్మూలా ఈ కారు రేసు (Formula E Car Case) కేసులో బీఆర్ఎస్ (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)మంగళవారం సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు.తెలంగాణ హైకోర్టు ( Telangana High Court) తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్మూలా ఈ కారు రేసు (Formula E Car Case) కేసులో బీఆర్ఎస్ (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)మంగళవారం సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు.తెలంగాణ హైకోర్టు ( Telangana High Court) తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.కేటీఆర్ పిటిషన్ పై తమ వాదనను కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
పార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను ఏసీబీ ఏ1 గా చేర్చింది. ఏ 2గా ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ 3 గా హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 16న కేటీఆర్ ను విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు రావాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న బీఎల్ఎన్ రెడ్డి, ఈ నెల 9న అరవింద్ కుమార్ ను ఈడీ విచారించనుంది.
ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అవినీతి జరగలేదని కేటీఆర్ వాదన. రాజకీయ కక్షతోనే ఈ కేసును నమోదు చేయించారని ఆరోపించారు. చట్టపరంగా కేసును ఎదుర్కొంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనలకు విరుద్దంగా ఎఫ్ఈఓకు రూ. 55 కోట్లు బదిలీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించడానికి కూడా ఆర్ బీ ఐ అనుమతి తీసుకోలేదని కూడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది.