Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన అరవింద్ కుమార్

Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ బుధవారం హాజరయ్యారు.

Update: 2025-01-08 06:38 GMT

Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన అరవింద్ కుమార్

Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ బుధవారం హాజరయ్యారు. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో అరవింద్ కుమార్ పేరును ఏ 2 గా ఏసీబీ చేర్చింది. ఈఎఫ్ఓతో ఒప్పందంతో పాటు నిధుల బదిలీకి సంబంధించి అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తాను ముందుకు నడుచుకోవాల్సి వచ్చిందని అరవింద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి గత ఏడాదిలో రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తన ఆదేశాలతోనే అరవింద్ కుమార్ నిధులు బదలాయించారని గతంలో కేటీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే హైకోర్టులో ఏసీబీకి ఇచ్చిన రిప్లైలో మాత్రం అందుకు విరుద్దంగా కేటీఆర్ సమాధానం ఇచ్చారు. విధానపరమైన అంశాలను అధికారులు మాత్రమే చూసుకోవాలని ఇందులో మంత్రిగా తనకు సంబంధం లేదని వివరించారు.

అరవింద్ కుమార్ కు ఏసీబీ ప్రశ్నలు

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఈడీ విచారణకు హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. అదే సమయంలో ఏసీబీ విచారణకు ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని మున్సిపల్ శాఖక్ష్ ప్రిన్సిఫల్ సెక్రటరీ దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు.

ఫార్మూలా ఈ కారు రేసు అగ్రిమెంట్ సమయంలో దానకిశోర్ కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఫార్మూలా ఈ కారు రేసు సీజన్ 10 నిర్వహణ విషయంలో హెచ్ఎండీఏ ఎందుకు తెరమీదికి వచ్చింది, ఆ సంస్థ నుంచి నిధులను ఎందుకు బదలాయించారు, గవర్నర్ అనుమతి లేకుండా సీజన్ 9 అగ్రిమెంట్ ను ఎందుకు రద్దు చేశారని ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

రెండో అగ్రిమెంట్ అంటే సీజన్ 10కి సంబంధించిన అగ్రిమెంట్ విషయంలో కాంపిటీటీవ్ అథారిటీకి సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. అగ్రిమెంట్ సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అగ్రిమెంట్ ఎలా చేశారని కూడా ప్రశ్నించనున్నారు.హెచ్ఎండీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదని అరవింద్ కుమార్ ను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News