Kingfisher Beers: మందు బాబుల‌కు షాక్‌.. తెలంగాణ‌కు కింగ్ ఫిష‌ర్ బీర్ల స‌ర‌ఫ‌రా నిలిపివేత‌..!

Kingfisher Beers: తెలంగాణకు కింగ్ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ స్పష్టం చేసింది.

Update: 2025-01-08 12:10 GMT

Kingfisher Beers: మందు బాబుల‌కు షాక్‌.. తెలంగాణ‌కు కింగ్ ఫిష‌ర్ బీర్ల స‌ర‌ఫ‌రా నిలిపివేత‌..!

Kingfisher Beers: తెలంగాణకు కింగ్ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ స్పష్టం చేసింది. దీంతో మందు బాబులకు సంక్రాంతి పండగ ముందు భారీ షాక్ తగిలినట్లైంది. తెలంగాణ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూబీఎల్ ప్రకటించింది. ప్రభుత్వం బీర్ల ధరలను పెంచింది కానీ.. తయారీ దారులకు చెల్లించే బేస్ ధరను పెంచకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని యూబీఎల్ తెలిపింది. బీర్ల సరఫరా నిలిపివేతకు ఇది కూడా ఒక కారణమని కంపెనీ పేర్కొంది. తెలంగాణ నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని చెప్పింది. ఈ జాప్యం కూడా కంపెనీ నష్టాలకు కారణమైందని తెలిపింది. ఈ విషయాన్ని సెబీకి లేఖ ద్వారా వివరించింది.

కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్‌తో పాటు ఇతర బ్రాండ్లను నిలిపివేస్తున్నట్టు యూబీఎల్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీర్ల అమ్మకాలను పరిశీలిస్తే కింగ్ ఫిషర్ బ్రాండ్స్ 60-70 శాతం అధికంగా విక్రయం అవుతున్నట్టు తెలిపింది. బిల్లుల అంశంతో పాటు బీర్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీర్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2019-20 నుంచి ఇప్పటివరకు బీర్ల ధరలు పెంచుకోవడానికి తెలంగాణ బేవరేజెస్ అనుమతించడం లేదు. దీనిపై యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ కంపెనీ ఆగ్రహంతో ఉంది.

బిల్లుల విషయం ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకోకపోవడంతో బీర్ల సరఫరాను ఆపివేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే బీర్ల సరఫరా నిలిపివేత అనేది తాత్కాలికం అని.. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే శాశ్వతంగా బీర్ల సరఫరా నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పండగ సీజన్‌లో బీర్లు నిలిపివేత మందుబాబులకు భారీ షాక్ అని చెప్పొచ్చు.



Tags:    

Similar News