Formula E Race Case: ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు
Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు వచ్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే విచారణకు న్యాయవాదితో కలిసి హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో జనవరి 8న పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ గదిలోకి కేటీఆర్ కు ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని విచారణ గదికి సమీపంలో ఉన్న లైబ్రరీలో కూర్చొని కేటీఆర్ ను చూసేందుకు న్యాయవాదికి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే విచారణ గదిలోకి కేటీఆర్ తో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని చేసిన అభ్యర్ధనతో పాటు ఆడియో, వీడియో రికార్డును కూడా కోర్టు తిరస్కరించింది.
ఫార్మూలా ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించి అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాల విషయమై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ , రికార్డు చేసిన అంశాల ఆధారంగా విచారణ నిర్వహించే అవకాశం ఉంది.ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీయనున్నారు. ఎఫ్ఈఓకు నగదు చెల్లింపుల్లో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ఆయనను విచారిస్తారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపేందుకు ఫార్మూలా ఈ కారు రేసు నిర్వహించామని కేటీఆర్ ప్రకటించారు.
ఫార్మూలా ఈ కారు రేసుపై ఏసీబీ కేసు నమోదైన తర్వాత తన ఆదేశాల మేరకే అరవింద్ కుమార్ ఎఫ్ఈఓకు నగదును బదిలీ చేశారని 2024 డిసెంబర్ 19న కేటీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ విషయమై కూడా కేటీఈర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.