Formula E Race Case: కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
Formula E Race Case: తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను జనవరి 15న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Formula E Race Case: తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను జనవరి 15న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్ ను తక్షణమే విచారించాలని కేటీఆర్ తరపు న్యాయవాది చేసిన వినతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. జనవరి 15న ఈ పిటిషన్ ను విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను జనవరి 7న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అదే రోజు సాయంత్రం సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తక్షణం విచారణ చేయాలని కేటీఆర్ న్యాయవాది సీజేఐ సంజీవ్ ఖన్నాను కోరారు. అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు. జనవరి 15న ఈ పిటిషన్ పై విచారణ చేస్తామన్నారు. ఈ నెల 16న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ జనవరి 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. నిబంధనలకు విరుద్దంగా ఈఎఫ్ఓ తో ఒప్పందం, నిధుల బదిలీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.అయితే ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.