Bhu Bharati Act: భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం.. ఇకపై నో ధరణి

Update: 2025-01-09 11:52 GMT

Bhu Bharati to replace Dharani portal: తెలంగాణ ప్రభుత్వం దరణి పోర్టల్ స్థానంలో తీసుకొస్తున్న భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో భూభారతి ఇప్పుడు అధికారికంగా చట్టరూపం దాల్చింది. గవర్నర్ ఆమోదం తరువాత రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ భూభారతి చట్టం కాపీని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందించారు.

తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దరణి చట్టం వల్ల ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు అనుగుణంగా ఉండేలా ధరణి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

Tags:    

Similar News