KTR: కేటీఆర్ లాగా ఎవరైనా ఏసీబీ విచారణకు లాయర్ ను తీసుకెళ్లొచ్చా?
KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్ కు న్యాయవాదితో పాటు హాజరయ్యేందుకు తెలంగాణహైకోర్టు అనుమతి ఇచ్చింది.
KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్ కు న్యాయవాదితో పాటు హాజరయ్యేందుకు తెలంగాణహైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కేటీఆర్ కే కాదు సాధారణ పౌరులు కూడా ఏ కేసులోనైనా విచారణకు హాజరయ్యేందుకు అడ్వకేట్ సహాయం తీసుకోవచ్చు. అయితే ఇందుకు కోర్టు అనుమతి ఉండాలి.
ఏదైనా కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు లేదా ఏసీబీ అధికారులు లేదా సీబీఐ నోటీసులు జారీ చేస్తే ఈ నోటీసుల ఆధారంగా విచారణకు న్యాయవాదితో కలిసి హాజరయ్యేందుకు నోటీసులు అందుకున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించాలి.
తాలుకా లేదా జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్ దాఖలు చేసి దీనిపై ఉత్తర్వులు పొందవచ్చు. అయితే దీనికి సంబంధించి కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలి. విచారణ గదిలోకి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తో న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఉంటే విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతిస్తారు.
కేటీఆర్ పిటిషన్ విషయంలో విచారణ గదిలోకి అడ్వకేట్ ను అనుమతించలేదు. విచారణ గదికి సమీపంలోని లైబ్రరీ నుంచి విచారణను చూసేందుకు అనుమతించింది. ఒకవేళ విచారణ గదిలోకి అడ్వకేట్ ను అనుమతిస్తే విచారణ అధికారులను అడ్వకేట్లు గమనిస్తారు.కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని భావిస్తే కేసుతో సంబంధం లేదని ప్రశ్నలు అడుగుతున్నారని న్యాయవాదులు అభ్యంతరం చెప్పే వీలుంటుంది. అదే సమయంలో విచారణ అధికారులు కూడా తమ వాదనలు వినిపించొచ్చు.
ఏదైనా ఆరోపణలు వచ్చిన వ్యక్తిని విచారణ అధికారులు నోటీసులు జారీ చేయాలి. ఆ నోటీసుల్లో విచారణకు హాజరు కావాల్సిన తేది, స్థలం స్పష్టంగా చెప్పాలి. అయితే విచారణకు అడ్వకేట్ తో కలిసి వెళ్లేందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. అయితే ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవడం లేదు. అయితే ఇందుకు అనేక కారణాలున్నాయి. ఆరోపణలు వచ్చిన వారు సామాన్యులైతే దర్యాప్తు అధికారులు వారికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశాలు తక్కువ. రాజకీయ నాయకులు, వీఐపీలు ఈ అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గతంలో ఇలానే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉన్నందున న్యాయవాదిని అనుమతించాలని కోర్టును కోరారు. అయితే అప్పట్లో న్యాయవాదికి అవినాష్ రెడ్డి విచారణ సమయంలో అనుమతి ఇచ్చింది.
అయితే విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించలేదు. అయితే విచారణ ప్రక్రియ ఆడియో, వీడియో రికార్డింగ్ కు హైకోర్టు అనుమతించింది. ఆడియో, వీడియో రికార్డింగ్ కోసం కేటీఆర్ న్యాయవాది చేసిన అభ్యర్ధనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. అడ్వకేట్ ను దూరంగా కూర్చొనేందుకు అనుమతి ఇచ్చింది. విచారణకు హాజరయ్యే సమయంలో అడ్వకేట్ ను అనుమతి తీసుకెళ్లే కొత్త సంప్రదాయం మొదలైందనే చర్చ ప్రారంభమైంది.