Formula E Race Case: కేటీఆర్ కు ఏసీబీ 30 ప్రశ్నలు

Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Update: 2025-01-09 06:04 GMT

Formula E Race Case: కేటీఆర్ కు ఏసీబీ 30 ప్రశ్నలు

Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తో పాటు ఏసీబీ కార్యాలయానికి ఆయన అడ్వకేట్ రామచంద్రరావు కూడా వెళ్లారు.

కేటీఆర్ ను ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని రెండో అంతస్తులోని విచారిస్తున్నారు. అదే గదికి ఎదురుగా ఉన్న లైబ్రరీ నుంచి ఈ విచారణను అడ్వకేట్ రామచంద్రరావు చూసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఎఎస్పీ నరేందర్, డీఎస్పీ మాజీద్ ఖాన్ లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.ఈ విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషీ పర్యవేక్షిస్తున్నారు.

ఏసీబీ అధికారులు 30 ప్రశ్నలతో ఆయనకు ఓ ప్రశ్నావళిని సిద్దం చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఎఫ్ఈఓకు నిధుల బదిలీతో పాటు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఫార్మూలా ఈ రేసుకు సంబంధించిన అగ్రిమెంట్ వంటి అంశాలపై కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఎఫ్ఈఓకు హెచ్ ఎం డి ఏ నుంచి రూ. 55 కోట్ల నిధుల బదిలీ విషయమై కూడా కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు.

ఈ ఒప్పందంలో మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారుల పాత్ర ఏంత వంటి అంశాలపై ఏసీబీ ప్రశ్నిస్తోంది.ఆర్ బీ ఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో నిధులు ఎందుకు బదిలీ చేశారని కూడా ఆయనను అడిగే అవకాశం ఉంది. కేబినెట్ అనుమతి లేదు, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అగ్రిమెంట్ ఎలా చేసుకొన్నారనే విషయాలపై కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారని కూడా ఆయనను ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News