Weather Report: బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణలో వర్షాలు?

Update: 2025-01-09 01:37 GMT

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో చలి భారీగా పెరుగుతుంది. బంగాళాఖాతంలో మళ్లీ అలజడి మొదలైంది. హిందూ మహాసముద్రం కూడా మరింత యాక్టివ్ గా మారింది. ఇవాళ ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉండగా, మరో అల్పపీడనం ఉత్తర తమిళనాడు పై ఉంది అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం క్రమంగా వాయువ్య వైపు కదులుతూ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ వైపు వచ్చేలా ఉంది. ఈ పరిస్థితిలో 11, 12వ తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లో రోజంతా పొడి వాతావరణం ఉంటుంది. మేఘాలు తక్కువగానే ఉంటాయి. పగటివేళ ఎండ వాతావరణం ఉంటుంది. రాత్రి చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో గాలి వేగం కూడా పెరిగింది. గంటకు 35 కిలోమీటర్లు వేగంగా గాలి ఉంది. ఏపీలో గంటకు 16 కిలోమీటర్లు.. తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని.. ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి తెలిపింది.

ఉష్ణోగ్రతలను చూసినట్లయితే పగటివేళ తెలంగాణలో 20 డిగ్రీల సెల్సియస్ ఉంటే.. ఏపీలో 29 డిగ్రీల నమోదు అవుతుంది. రాత్రి వేళలో తెలంగాణలో 15 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. అడవులు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. తేమ పగటివేళ తెలంగాణలో 50% ఉండగా.. ఏపీలో 60 శాతం ఉంటుందని తెలిపింది. రాత్రివేళ తెలంగాణలో 90% తేమ ఉంటే ఏపీలో 90 శాతానికి మించి ఉంటుందని తెలిపింది. మంచు బాగా కురుస్తుందని.. అందువల్ల రాత్రి వేళలో చలిని కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలని ప్రజలకు సూచించింది ఐఎండీ.

Tags:    

Similar News