Formula E Race: కేటీఆర్ ‌కు లాయర్ అనుమతి.. కానీ...

Formula E Race: కేటీఆర్ కనిపించే దూరంలో లాయర్ ఉండేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Update: 2025-01-08 11:18 GMT

Formula E Race: కేటీఆర్ కనిపించే దూరంలో లాయర్ ఉండేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతివ్వాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జనవరి 9న విచారణకు హాజరుకావాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. విచారణ సమయంలో లాయర్ తో కలిసి కూర్చొనే అవకాశం లేదని హైకోర్టు తెలిపింది. సీసీ టీవీ పర్యవేక్షణ లేదా కేటీఆర్ కనిపించేంత దూరంలో లాయర్ ఉండేందుకు కోర్టు అనుమతించింది.విచారణపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావచ్చని హైకోర్టు తెలిపింది.

ఏసీబీ కేసులో విచారణ జరిగే గదిలోకి కేటీఆర్ తో కలిసి న్యాయవాది కూర్చుకొనేందుకు వీలు లేదని ఏఏజీ వాదించారు. ఇందుకు సంబంధించి పలు కోర్టు తీర్పును ప్రస్తావించారు. కేటీఆర్ తో పాటు న్యాయవాదిని అనుమతించాలని... కేటీఆర్ ను ఏసీబీ అడిగే ప్రశ్నలను కూడా వినేందుకు అవకాశం కల్పించాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. స్టేట్ మెంట్ రికార్డు చేసే సమయంలో కూడా న్యాయవాది కేటీఆర్ తో ఉండేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇక విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేయాలని కూడా కోర్టును అభ్యర్ధించారు.

రెండు ప్రతిపాదనల్లో ఏదో ఒక ఆప్షన్ ను మాత్రమే ఎంచుకోవాలని హైకోర్టు కేటీఆర్ తరపు న్యాయవాదిని కోరింది. జనవరి 9న ఏసీబీ విచారణకు న్యాయవాదితో కలిసి వెళ్లాలని హైకోర్టు సూచించింది. విచారణ జరిగే సమయంలో లైబ్రరీ రూమ్ నుంచి కేటీఆర్ ను న్యాయవాది చూసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ నిర్వహించే గది,లైబ్రరీ దగ్గరగా ఉంటాయి. లైబ్రరీ గది అద్దాలతో ఉంటుంది. దీంతో కేటీఆర్ ను చూసే వెసులుబాటు ఉంటుందని ఏఏజీ కోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు ఇందుకు అనుమతి అంగీకరించింది.

గతంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ సమయంలో ఆడియో, వీడియో తీయాలని... న్యాయవాది కంటికి కనిపించే దూరంలో అవినాష్ రెడ్డిని విచారించాలని అప్పట్లో హైకోర్టు తీర్పును వెల్లడించింది. కేటీఆర్ తరపు న్యాయవాది ఈ తీర్పును ప్రస్తావించారు. అయితే ఆ కేసు హత్యకు సంబంధించి, సీబీఐ ఎస్పీపై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసుకు ఇచ్చిన ఉత్తర్వులు ఈ కేసుకు ఇవ్వడానికి వీలు కాదని హైకోర్టు తెలిపింది. కేటీఆర్ న్యాయవాది ఎంచుకున్న రెండు ఆఫ్షన్లలో ఒక్కదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలని కోర్టు కోరింది.

Tags:    

Similar News