థర్డ్ డిగ్రీ ప్రయోగం ఉండదు కదా... లాయరెందుకు?: కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టు
Telangana High Court: తనతో పాటు ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
Telangana High Court: తనతో పాటు ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గతంలోనూ లాయర్ అనుమతికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని కేటీఆర్ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు న్యాయవాదిని అనుమతించిందని ఆయన గుర్తు చేశారు. విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించమని హైకోర్టు తెలిపింది. కానీ, ఏసీబీ కార్యాలయంలో న్యాయవాదికి కనిపించేలా విచారణ గదులున్నాయా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదికి కనిపించే దూరంలో విచారణ జరగాలని హైకోర్టు తెలిపింది. కేటీఆర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉండదు.. అలాంటప్పుడు విచారణ గదిలోకి న్యాయవాది ఎందుకు అని హైకోర్టు ప్రశ్నించింది.
కేటీఆర్ వెంటన న్యాయవాదిని అనుమతించవద్దని ఏఏజీ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు.కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతిస్తే సమస్య ఏంటని ఏఏజీని అడిగింది. విచారణను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.