నేటి అడ్డంకులే రేపటి విజయానికి నాంది.. ఫార్ములా ఈ కేసు పై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

ఫార్ములా ఈ-కారు కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2025-01-07 14:26 GMT

నేటి అడ్డంకులే రేపటి విజయానికి నాంది.. ఫార్ములా ఈ కేసు పై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

ఫార్ములా ఈ-కారు కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తన మాటలు రాసిపెట్టుకోండి. ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని అన్నారు. అబద్దాలు తనను దెబ్బతీయలేవని.. కుట్రలతో తన నోరు మూయించలేరని అన్నారు. ఇవాళ్టి అడ్డంకులే రేపటి విజయానికి సోపానాలు. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది. తాను మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందని తన అచంచలమైన నమ్మకం. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుంది. త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమవ్వనుంది అని కేటీఆర్ ట్వీట్ చేశారు.



ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కేసుపై కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం.. అలాగే ఈడీ మరోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. అయితే కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

పార్ములా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కేటీఆర్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.మరోవైపు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ, 16న విచారణకు రావాలని ఈడీ మరోసారి నోటీసులిచ్చాయి. 


Tags:    

Similar News