Formula E Car Race Case: 'అంతిమ లబ్దిదారులు ఎవరో తేలాలి'

ఫార్మూలా ఈ కారు రేసు(Formula E Car Race Case) కేసులో అంతిమ లబ్దిదారులు ఎవరో తేలాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court)అభిప్రాయపడింది.

Update: 2025-01-07 11:19 GMT

Formula E Car Race Case: 'అంతిమ లబ్దిదారులు ఎవరో తేలాలి'

ఫార్మూలా ఈ కారు రేసు(Formula E Car Race Case) కేసులో అంతిమ లబ్దిదారులు ఎవరో తేలాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court)అభిప్రాయపడింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు జనవరి 7న కొట్టివేసింది.ఈ తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించారు.

అధికారం దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ లో తెలిపారని, నిధులు దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలున్నాయని కోర్టు ఆ తీర్పులో ప్రస్తావించింది. నిబంధనలకు విరుద్దంగా హెచ్ఎండీఏ నిధులు బదిలీ చేశారని ఆరోపణలను గుర్తు చేసింది. దీంతో రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూరిందనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపింది. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకే లబ్ది చేకూర్చారని ఆరోపణలతో ఏసీబీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిందని జడ్జి తెలిపారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్బాల్లోనే వాడాలని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వాడాలని తీర్పులో కోర్టు స్పష్టం చేసింది.

ఏసీబీ ఆరోపణలపై తాము విచారణ చేయాలనుకోవడం లేదని కోర్టు తేల్చేసింది. ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేయరని కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు.ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది.ఇందుకు సంబంధించి పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరించింది కోర్టు.

ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపైనే ఉంటుందని కోర్టు తెలిపింది.కేబినెట్ ఆమోదం లేదని లావాదేవీలపై విచారణ జరగాలని హైకోర్టు అభిప్రాయపడింది.హెచ్ఎండీఏ లావాదేవీలతో ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే వాదనను కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.

Tags:    

Similar News