ఫార్మూలా ఈ కారు రేసు కేసులో న్యాయపోరాటం చేస్తా: కేటీఆర్
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో తాను చిన్న పైసా కూడా అవినీతికి పాల్పడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో తాను చిన్న పైసా కూడా అవినీతికి పాల్పడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని నందినగర్ లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.తనపై పెట్టిన కేసు రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిందని ఆయన అన్నారు. కక్ష సాధింపు అని తెలిసి కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యాయని ఆయన చెప్పారు.
తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తే కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఏసీబీ, ఈడీ విచారణకు హాజరౌతానని ఆయన అన్నారు. అయితే తాను అడ్వకేట్ తో కలిసి విచారణకు హాజరౌతానని ఆయన చెప్పారు. అడ్వకేట్ తో కలిసి విచారణకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని హైకోర్టును ఆశ్రయిస్తానని కేటీఆర్ తెలిపారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. రాజ్యంగం తనకు ఇచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుంటానని ఆయన అన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు.
అధికారం అడ్డం పెట్టుకొని తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.తాను ఏ తప్పు చేయలేదని.. అందుకే తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తనపై కేసు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన అన్నారు. ఫార్మూలా ఈ కారు రేసుపై కాదు... ఫార్మర్ సమస్యపై చర్చ జరగాలని ఆయన కోరారు.
విధ్వంసం, మోసం కాంగ్రెస్ నైజమని ఆయన విమర్శించారు.తనపై పెట్టిన కేసులో పస లేదన్నారు. అందుకే తాను ఏ విచారణకు హాజరౌతానని చెబుతున్నానన్నారు. వందకు వందశాతం న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదో జరిగింది కాంగ్రెస్ హడావుడి చేస్తోందన్నారు.కొందరు మంత్రులు న్యాయమూర్తుల్లా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏం జరగబోతోందో కొందరు మంత్రులు ముందే చెబుతున్నారని విచారణ సచివాలయంలో కానీ, మంత్రుల పేషీల్లో జరగదని ఆయన అన్నారు.గతంలో మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే కోర్టుకే వెళ్లారని ఆయన కాంగ్రెస్ నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ఈ రేసు ఉద్దేశమని ఆయన వివరించారు.