VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై అవగాహన కల్పిస్తూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

VC Sajjanar: ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఎక్కువయ్యాయి. వీటి మాయలో పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Update: 2025-01-07 07:57 GMT

VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై అవగాహన కల్పిస్తూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

VC Sajjanar: ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఎక్కువయ్యాయి. వీటి మాయలో పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే అలాంటి మోసాలపై అవగాహన పెంచేందుకు తాజాగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ వీడియో షేర్ చేశారు. డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఇంట్లో కూర్చుని ఆడుతూ పాడుతూ లక్షల్లో సంపాదించండి అంటూ వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఆశ పడడంలో తప్పు లేదు.. కానీ అత్యాశ పనికిరాదని వార్నింగ్ ఇచ్చారు. రూ. 1000 పెట్టుబడి పెట్టి చిటికెలో రూ.లక్ష సంపాదించుకోవచ్చని చెబుతున్న ఈ వీడియో పూర్తిగా అబద్దమని చెప్పారు. 99 రెట్లు లాభం వస్తుందని చెబితే నమ్మి మోసపోవద్దని అన్నారు.

ఇలాంటి వీడియోలతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు విసిరే వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. వీడియోలో చూపించిన నోట్ల కట్టలు చూసి అత్యాశకు పోవద్దన్నారు. ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అత్యాశకు పోతే చివరికి బాధ, దుఖమే మిగులుతాయనే సత్యం గుర్తించాలన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా ముందే జాగ్రత్తగా ఉండడం ఉత్తమమని వివరించారు. నోట్ల కట్టలతో అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ మాయగాళ్ల గురించి ఎవరికైన తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.

ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి. వీటి వలలో పడి చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించినా.. ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే కోరికతో వారి మాయలో చిక్కుకుంటున్నారు. ఫలితంగా జీవితాలను కోల్పోతున్నారు. చివరికి కన్నవారికి, కట్టుకున్న వారికి బాధను మిగులుస్తున్నారు. అందుకే వీటిపై తరచూ సజ్జనార్ అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మంచంపై నోట్ల కట్టలను వెదజల్లుతూ ఉన్న వీడియోను షేర్ చేశారు.


Tags:    

Similar News