Formula E Race Case: సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

Update: 2025-01-07 08:29 GMT

Formula E Race Case: సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదనలు వినాలని ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది.

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు జనవరి 7న కొట్టివేసింది. ఈ తీర్పు కాపీ అందిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేటీఆర్ భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కేటీఆర్ లీగల్ టీమ్ సభ్యులైన సోమ భరత్ మీడియాకు చెప్పారు. కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

పార్మూలా ఈ కారు రేసులో తెలంగాణ ఏసీబీ కేటీఆర్ పై 2024 డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది. ఇదే ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు.

జనవరి 9న విచారణకు రావాలని కోరారు. ఈ నెల 8,9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు ఐఎఎస్ అధికారి, బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు పంపింది. ఇదే కేసులో జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు పంపింది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో విచారణకు సమయం ఇవ్వాలని కేటీఆర్ జనవరి 6న ఈడీని కోరారు. దీంతో ఈడీ కేటీఆర్ వినతికి అంగీకరించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసినందున మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News