Formula E race Case: కేవలం అందుకోసమే కేటీఆర్‌పై కేసు పెట్టారన్న హరీష్ రావు

High court verdict on KTR quash petition in Formula E race Case: రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు అన్నారు. యాసంగి పంటకు ఇవ్వాల్సిన రైతు భరోసా పథకం నిధులు కూడా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు.

Update: 2025-01-07 07:15 GMT

High court verdict on KTR quash petition in Formula E race Case: రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు అన్నారు. అందులో భాగంగానే కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌ను హై కోర్టు కొట్టేసిన అనంతరం హరీష్ రావు కేటీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. అనంతరం కేటీఆర్ నివాసం బయట ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వర్షాకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు ఇస్తామన్న రైతు బంధు పథకం ఇవ్వలేదన్నారు. యాసంగి పంటకు ఇచ్చే సాయం కూడా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. దీంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సర్కారు అందులోంచి బయటపడటం కోసమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.

ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసు

"తెలంగాణ ప్రజల్లో రేవంత్ రెడ్డి సర్కారుపై వ్యతిరేకత పెరిగిందని ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్టులు చెబుతున్నాయన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టి ప్రజల దృష్టిని మరల్చాలని చేసిన కుట్రే ఈ ఏసీబీ కేసు" అని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ రేవంత్ రెడ్డి మాలాంటి నాయకులపై ఇలాంటి అక్రమ కేసులు ఇంకా చాలా పెడతారని తమకు ముందే తెలుసునని ఆయన చెప్పారు. ఆ క్రమ కేసులను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమకు తెలంగాణ ప్రజలు, రాష్ట్రమే ముఖ్యమని హరీష్ రావు అన్నారు.

నిన్నూ, నీ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టం - హరీష్ రావు

ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని హరీష్ రావు గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసేదాకా నిన్ను, నీ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో, అక్రమ కేసులతోనో మిమ్మల్ని బలహీనపరుస్తామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోబోమని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హరీష్ రావు తేల్చిచెప్పారు. 

Tags:    

Similar News