Telangana voters list: తెలంగాణలో 3.35 కోట్ల ఓటర్లు.. జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం

Telangana voters list: తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలంగాణలో మొత్తం ఓటర్ల జాబితాను ప్రకటించారు.

Update: 2025-01-06 14:50 GMT

Telangana voters list: తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలంగాణలో మొత్తం ఓటర్ల జాబితాను ప్రకటించారు. అధికారుల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,66,41,489 మంది పురుషులు కాగా.. 1,68,67,735 మంది మహిళలున్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నారు.

ఇందులో 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 5,45,026 మంది కాగా.. 85 సంవత్సరాల పైబడిన వారు 2,22,091 మంది ఉన్నారు. దివ్యాంగులు 5,26.993 మంది ఉన్నారు. ఇక శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉండగా.. భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.

ఈ గణాంకాలు పంచాయతీ ఎన్నికల అవసరాల కోసం ప్రత్యేకంగా సర్వే చేసి సేకరించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ జాబితా విడుదలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావడానికి పార్టీలన్నీ మరింత చురుగ్గా వ్యవహరించనున్నాయి. ఓటింగ్ హక్కు పట్ల అవగాహన పెంచుతూ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News