TSPSC 2020: నిరుద్యోగులకు శుభవార్త: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్
తెలంగణలోని నిరుద్యోగులకు TSPSC శుభవార్తను తెలిపింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSBలోని మొత్తం 93 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగణలోని నిరుద్యోగులకు TSPSC శుభవార్తను తెలిపింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSBలోని మొత్తం 93 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లో మేనేజర్ పోస్టులకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తును కొరుతుంది.
ఈ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 16వ తేది 2020 నాడు ప్రారంభం అయి మార్చి 30వ తేదీన ముగియనున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.
ఇక 93 ఖాళీలలో పోస్టుల వివరాలను చూసుకుంటే 79 పోస్టులను మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)లో ఉన్నాయి. మిగతా వాటిలో 6 పోస్టులను మేనేజర్ (మెకానికల్ ఇంజనీరింగ్), అదే విధంగా 04 పోస్టులను మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పోస్టులు ఉన్నాయి. వాటితో పాటుగానే మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)- 03 పోస్టులు, మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)- 01 ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
♦ ఆన్ లైన్ దరఖాస్తులు 2020 మార్చి 16వ తేది ప్రారంభం అవుతాయి.
♦ ఆన్ లైన్ దరఖాస్తులు 2020 మార్చి 30 వతేదీన ముగియనున్నాయి.
♦ విద్యార్హత : సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ.
వయో పరిమితి...
♦ 2020 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు.
♦ వికలాంగులకు 10 ఏళ్లు సడలింపు.
♦ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు సడలింపు.
♦ ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు.
♦ దరఖాస్తు రుసుము : రూ.200
♦ పరీక్షా కేంద్రాలు : కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.