TS SSC 2020 : అందుబాటులోకి పదో తరగతి హాల్ టికెట్లు

తెలంగాణ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పదోతరగతి విద్యార్థుల హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ - www.bse.telangana.gov.in లో విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సి పరీక్షలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 10 వరకు జరగాల్సి ఉంది.

Update: 2020-03-12 13:12 GMT

తెలంగాణ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పదోతరగతి విద్యార్థుల హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ - www.bse.telangana.gov.in లో విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సి పరీక్షలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 10 వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ పరీక్షకు 5.34 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష తరువాత, మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 18 వరకు ఉంటుంది. ప్రైవేటుగా పరీక్ష రాస్తున్నవిద్యార్థులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS SSC 2020 హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

♦ ముందుగా BSE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - bse.telangana.gov.in

♦ టీఎస్ ఎస్ఎస్సి హాల్ టికెట్ పై క్లిక్ చేయండి.

♦ రెగ్యులర్, ప్రైవేట్, OSSC, ఒకేషనల్ కోర్సులను ఎంచుకోవడానికి అభ్యర్థులను నిర్దేశిస్తూ కొత్త విండో తెరవబడుతుంది.

♦ పూర్తివివరాలను నమోదు చేయాలి.

♦ డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ వస్తుంది.

♦ భవిష్యత్ ఉపయోగం కోసం హాల్ టికెట్ నుండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

2019 లో బాలికలు 93.68 ఉత్తీర్ణత సాధించిన అబ్బాయిలను అధిగమించారు. తెలంగాణలోని జగ్టియల్ జిల్లా 99.30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్ 89.09 శాతంతో అత్యల్ప స్థానాన్ని దక్కించుకుంది.

Tags:    

Similar News